హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కలెక్టరెట్‌లో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు

MNCL: నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గురువారం ఉదయం 10 గంటలకు ప్రజా పాలన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.