హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నకిలీ సోషల్ ఖాతాపై చర్యలకు డిమాండ్

KKD: ‘రాయలసీమ ముద్దుబిడ్డ’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతా ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొంటూ చర్యలు తీసుకోవాలని సామర్లకోట టౌన్ టీడీపీ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్ నేతృత్వంలో బుధవారం సీఐ కృష్ణ భగవాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సీఐ తెలిపారు.