హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలీన గ్రామాలతో ఎన్నికలా?

E.G: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 12 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి కోర్టు తీర్పుతో స్పష్టత వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. విలీన గ్రామాలను కలుపుకుని ఎన్నికలు నిర్వహిస్తారా? లేక గతంలో ఉన్న కార్పొరేషన్ పరిధిలోనే ఎన్నికలు జరుగుతాయా? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు అధికార కూటమి నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.