హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే పోలీసుల చొరవతో బ్యాగ్ అప్పగింత

KKD: తుని స్టేషన్‌లో ప్రయాణికురాలు మరిచిపోయిన బ్యాగును రైల్వే పోలీసులు బుధవారం అప్పగించారు. డీఎల్‌పురానికి చెందిన మెరుగు గంగమ్మ తన కుమారుడు రాజుతో విశాఖ వెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చారు. హడావుడిలో ప్లాట్‌ఫాం-2పై ఐఫోన్, రూ.10 వేల నగదున్న సంచిని వదిలేశారు. సమాచారంతో ఎస్‌ఐ వి. సత్తిబాబు సంచిని స్వాధీనం చేసుకుని వారికి అందజేశారు.