హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు: సీఐ

ASF: కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని సీఐ కుమార్ స్వామి తెలిపారు. బయటి ప్రాంతాల నుంచి డీజే సౌండ్ సిస్టమ్స్ వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషనుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.