హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతగిరిలో SMC ఎన్నికలపై చర్చ

ASR: అనంతగిరి మండలంలోని 175 పాఠశాలల్లో SMC ఎన్నికలు ఈనెల 29న నిర్వహించనున్నట్లు ఎంఈఓ కే.బాలాజీ బుధవారం తెలిపారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం 1.30గంటలకు ఛైర్‌పర్సన్, వైస్‌ ఛైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయడమే లక్ష్యమన్నారు.