హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ద్వారపూడిలో టీడీపీలోకి భారీ చేరికలు

కోనసీమ: మండపేట మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన తులా కృష్ణరామ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది బుధవారం రాత్రి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.