హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పూడికతీత పనులకు ఎలాంటి బిల్లులు చెల్లించలేదు'

ASR: కొయ్యూరు చెక్‌డ్యామ్ పూడికతీతకు రూ.16లక్షలు మంజూరై, పనులు పూర్తికాకుండానే బిల్లులు చెల్లించారన్న వార్తలు అవాస్తవమని మండల ఇంజినీరింగ్ అధికారి రామకృష్ణ ఖండించారు. పూడికతీత పూర్తయిందని, పనులకు రూ.4లక్షలు మాత్రమే మంజూరయ్యాయన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి బిల్లులు చెల్లించలేదన్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఇంజినీరింగ్ అధికారులకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు.