హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహ వాహనంపై శ్రీరంగనాథ స్వామి

KDP: పులివెందుల శ్రీరంగనాథ స్వామి ఆలయంలో నూలు పూజ, పవిత్ర ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారు సింహ వాహనంపై కొలువుదీరారు. అర్చకులు కృష్ణరాజేశ్ శర్మ, ఫణిశర్మల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఉదయం అభిషేకం, సాయంత్రం ఉభయదారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.