హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విశ్వకర్మ జయంతి వేడుకలు

CTR: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లోని వివేకానంద భవన్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖాధికారి రబ్బానీ బాషా తెలిపారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.