MDK: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేగుంట, కసాన్‌పల్లి, చందాయిపేట, గొల్లపల్లి గ్రామాల్లో కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఎంపిక చేసిన 52 మందిని ఉచిత ఆపరేషన్ల కోసం హైదరాబాద్‌కు తరలించారు. పేదలకు వైద్యం అందించడమే తమ లక్ష్యమని క్లబ్ జిల్లా హెల్త్ క్యాంప్ ఛైర్మన్ స్వర్గం సిద్ధిరాములు తెలిపారు. సర్జరీల అనంతరం వారిని సొంత ఊళ్లకు చేర్చుతామన్నారు.
తెలంగాణ
ఉచిత కంటి ఆపరేషన్లకు 52 మంది ఎంపిక


