CTR: ఖరీఫ్ ఈ-పంట నమోదు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 7.22 లక్షల ఎకరాలకు 13.08 లక్షల సర్వే నంబర్లు నమోదు చేయాల్సి ఉండగా 4.63 లక్షల ఎకరాల్లో 67.4 శాతం పూర్తయింది. నమోదు వేగవంతం చేయాలని అధికారులకు సూచించామన్నారు. ఈ-పంట ఆధారంగానే ప్రోత్సాహక పథకాలు మంజూరవుతాయని, రైతులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ పంట నమోదుకు గడువు పెంపు


