GDWL: ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం చేయూత పథకంపై ఎంపీడీవో రమాదేవి సమావేశం నిర్వహించారు. పథకం విధివిధానాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టాలని సూచించారు. పథకం నిబంధనలను అధికారులకు వివరించారు. లబ్ధిదారుల ఎంపిక, పరిశీలనలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
తెలంగాణ
అవకతవకలకు తావు లేదు: ఎంపీడీవో


