హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం మండల అధ్యక్షుడిగా ఉమేష్‌కుమార్‌

NRPT: బీజేవైఎం మద్దూరు మండల అధ్యక్షుడిగా పల్లెర్ల ఉమేష్‌కుమార్‌ను నియమించారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్‌కుమార్‌కు ఉమేష్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తానని పేర్కొన్నారు.