హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిలో మంత్రి దామోదర పర్యటన

SRD: రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ నేడు సంగారెడ్డి పట్టణంలో పర్యటించనున్నారని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9.55 గంటలకు కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు మెడికల్ కళాశాల క్రీడా మైదానాన్ని ప్రారంభించి, స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలలో వారు పాల్గొంటారు.