హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెమలి వాహనంపై వినాయకుడి విహారం

CTR: కాణిపాకంలో ఆలయ వార్షికోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారిని నెమలి వాహనంపై మేళా తాళాలతో ఊరేగించారు. ఈ వాహన సేవను పెద్ద సంఖ్యలో భక్తులు భక్తి భావంతో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాలకు చెందిన రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.