హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనాల్లో వ్యక్తి మృతి

GNTR: తుళ్లూరు మండలం పెదపరిమిలో బుధవారం వినాయక నిమజ్జనాల్లో తీవ్ర విషాదం నెలకుంది. నిమజ్జనం కోసం చెరువు ప్రాంతాన్ని పరిశీలించేందుకు నీటిలోకి దిగిన బత్తుల శ్రీనివాసరావు (39) ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. గ్రామస్తులు గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.