హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎయిర్‌పోర్టులో నేటి నుంచి యాత్రి సేవా కార్యక్రమాలు

కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్టులో యాత్రి సేవా అభియాన్‌లో భాగంగా ఇవాళ్టి నుంచి అక్టోబర్ 10 వరకు 24 రోజుల్లో 24 కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల భద్రత, సేవలు, సౌకర్యాలపై అవగాహన కల్పిస్తామన్నారు. డిజీ యాత్ర వినియోగం, గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఎయిర్‌పోర్ట్‌పై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు.