ప్రతాప్‌గఢ్ జిల్లా(UP) హతిగ్వాన్ పరిధిలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద పెను ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ట్రాక్‌పై ఉన్న సుమారు 30-35 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. రైలు వేగంగా రావడం గమనించిన కొందరు మహిళలు అప్రమత్తమై పక్కకు తప్పుకోవడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఘటనపై RPF సిబ్బంది విచారణ చేపట్టారు.
క్రైమ్
పట్టాలపై మూగజీవాల మృత్యుఘోష


