హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డుపైకి వచ్చి వైసీపీ శ్రేణుల ఆందోళన

నెల్లూరు పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించిన వైసీపీ విద్యార్థి విభాగం నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్‌తో పాటు పలువురు నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మద్దతు తెలిపారు.