కోనసీమ: ఎల్‌నినో ప్రభావంతో ఎండలు పెరిగి కొత్తపేట నియోజకవర్గంలో కరెంట్ వినియోగం భారీగా పెరిగిందని విద్యుత్ శాఖ ఈఈ రాంబాబు తెలిపారు. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో పవర్ గ్రిడ్ పై ఒత్తిడి పడుతోందని బుధవారం చెప్పారు. గ్రిడ్ వైఫల్యాన్ని నివారించేందుకు ప్రజలు సాయంత్రం, రాత్రి వేళల్లో విద్యుత్ వాడకాన్ని తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు
ఆంధ్రప్రదేశ్
కరెంట్ వాడకం తగ్గించాలి : ఈఈ


