VZM: గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు యువత, విద్యార్థులు కలిసికట్టుగా కృషి చేయాలని ఎస్పీ దామోదర్ పిలుపునిచ్చారు. ఎస్.కోటలో పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 3కే రన్, గంజాయిపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. గంజాయి విక్రయాలు, వినియోగం, తరలింపుపై సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గంజాయి నిర్మూలనకు కలిసికట్టుగా పోరాడాలి'


