హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన'

WG: ఆచంట మండలంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నిమిత్తం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అఖిల పక్ష నాయకులతో ఎంపీడీఓ కృష్ణమోహన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల దృష్ట్యా మండలంలో 59 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు.