హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పం బైపాస్‌ వద్ద రైతు బజార్

CTR: కుప్పం బైపాస్‌ రోడ్డులోని రాజీవ్‌ కాలనీ సమీపంలో రైతు బజార్‌ ఏర్పాటుకు చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్, కడప పీడీ వికాస్‌ మర్మత్‌ బుధవారం స్థలాన్ని పరిశీలించారు. సుమారు 34 సెంట్ల విస్తీర్ణంలో రైతు బజార్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా దీనికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.