హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చెరువులు నింపి పంటలను కాపాడాలి'

ATP: శ్రీశైలంలో నీళ్లున్నా జిల్లా చెరువులను నింపకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీ-నీవా ద్వారా మరో 17 టీఎంసీల నీటిని తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. వెంటనే చెరువులు నింపి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం హంద్రీ-నీవా సీఈ కార్యాలయం ఎదుట జలదీక్ష చేపడతామన్నారు.