హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ బైక్ రేసింగ్‌లో సత్తా చాటిన జిల్లా వాసి

ATP: జాతీయస్థాయి బైక్ రేసింగ్ పోటీలలో తాడిపత్రికి చెందిన హర్ష సత్తా చాటాడు. చెన్నైలో జరిగిన ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచాడు. గన్నెవారిపల్లికి చెందిన హర్ష బెంగళూరులో బీటెక్ చదువుతూ చెన్నైలో రేసింగ్‌లో శిక్షణ పొందాడు. జాతీయస్థాయి పోటీలలో రాణించడం పట్ల తల్లిదండ్రులు గోపాల్, వరలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.