హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఈనెల 18న వాక్‌-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.సత్యనారాయణ బుధవారం తెలిపారు. కంప్యూటర్ అప్లికేషన్, కామర్స్, బోటనీ, జువాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరుకావాలన్నారు.