హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాగణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: ఎస్‌కోటలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. భక్తుల విశేష దర్శనార్థం ట్రస్ట్ నిర్వాహకులు రోల్డ్ గోల్డ్ బిస్కెట్లతో ఏర్పాటు చేసిన 108 అడుగుల మహాగణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసి గణనాథుడిని దర్శించుకున్నారు.