హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్టీ మారడంపై కామూరి క్లారిటీ..!

ప్రకాశం: గిద్దలూరు వైసీపీ నాయకుడు కామూరి రమణారెడ్డి తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. జనసేనలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తన శ్వాస ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌తోనే కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి గిద్దలూరు సీటును జగన్‌కు కానుకగా ఇస్తానన్నారు.