హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎల్‌నినో పరిస్దితులపై అవగాహన కల్పించాలి'

E.G: అనపర్తి మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన పాలక మండలి సాధారణ సమావేశంలో అనపర్తి MLA నల్లమిల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో పలు తీర్మానాలపై ఎమ్మెల్యే చర్చించారు. పాలకవర్గం కాలపరిమితి పెంపుకి తీర్మానం ఆమోదం తెలిపారు. ఎల్‌నినో పరిస్దితులపై నీటిఎద్దడి గురించి రైతులకు అవగాహన కల్పించాలని సభ్యులకు ఎమ్మెల్యే వివరించారు.