హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో స్వచ్ఛతా హి సేవా'

అన్నమయ్య: జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, స్వచ్ఛ పాఠశాలలు, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.