ASR: నేరేడువలసలో సర్వే నంబర్ 53/3లో ఉన్న ప్రభుత్వ పాఠశాల భూమిని పరిరక్షించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. కొందరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చేపట్టి గిరిజనేతరులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పాఠశాల భూమిని పరిరక్షించాలి'


