AKP: బీసీ వసతి గృహంలో గిరిజన, దళిత, పేద విద్యార్థులకు పండగపూట కూడా భోజనం అందించలేదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు బుధవారం తెలిపారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, తక్షణమే పూర్తిస్థాయి వార్డెన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. వెంటనే దర్యాప్తు చేపట్టకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'పండుగపూట భోజనం పెట్టకపోవడం అన్యాయం'


