హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో ఉరేసుకొని వ్యక్తి మృతి

BPT: ఈపూరుపాలెంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. మీసేవ సమీపంలో నివసించే పుండరీ వెంకటేష్ అనే 25 ఏళ్ల యువకుడు ఉరేసుకొని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో సబార్డినేట్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.