హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే సాయం

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మానవత్వం చాటుకున్నారు. సరుబుజ్జిలి వెళ్తుండగా కొత్తకోట జంక్షన్‌ వద్ద కుక్కలు అడ్డురావడంతో బుధవారం ఆటో ప్రమాదానికి గురై పలువురు గాయపడ్డారు. ఈ ఘటనను గమనించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి క్షతగాత్రులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు.