VZM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ నాయకురాలు బొత్స అనూష తెలిపారు. ఈ మేరకు ఆమె మెరకముడిదాం మండల కేంద్రంలో బుధవారం మండల వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత బొత్స సందీప్, KSRK ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలి'


