హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాత కక్షలతో కత్తితో దాడి

KDP: బద్వేలులో గుంతపల్లి క్రాస్‌రోడ్డు వద్ద దినేష్, మధన్ అనే అన్నదమ్ములపై కత్తితో దాడి జరిగింది. ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదాన్ని మనసులో పెట్టుకుని కడపకు చెందిన యశ్వంత్ దాడికి పాల్పడినట్లు సమాచారం. గాయపడిన ఇద్దరినీ కడప రిమ్స్‌కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.