JGL: పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన సుంకరి స్వరూప పురిటి నొప్పులతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మగబిడ్డకు జన్మనిచ్చారు. మంగళవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది జ్యోతి, శ్రీనివాస్‌ప్రసాద్ వెంటనే స్పందించి తల్లీబిడ్డను జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం


