MLG: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ములుగు జిల్లా జట్టు ఎంపికలు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు మల్లంపల్లిలోని వివేకానంద స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. జూనియర్, సబ్‌జూనియర్ బాలబాలికలకు సెలక్షన్స్ ఉంటాయని నిర్వాహకులు బత్తిని సురేష్, గంట శ్రీను తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్ కార్డ్, టెన్త్ మెమోతో హాజరుకావాలన్నారు.
తెలంగాణ
రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టు కోసం ఎంపికలు


