WGL: రైలులో పోగొట్టుకున్న ఫోనును రైల్వే పోలీసులు బాధితురాలకు అప్పగించిన ఘటన బుధవారం జరిగింది. నెల్లూరుకు చెందిన భోగిరెడ్డి వసంత ఈనెల 12న HYD నుంచి నెల్లూరుకు చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ మొబైల్ ఫోన్ మర్చిపోయింది. 139 హెల్ప్ లైన్‌కు ఫిర్యాదుచేయగా.. నైట్ ట్రైన్ పెట్రోలింగ్ సిబ్బంది దినేశ్ ఫోన్‌ను గుర్తించి, స్వాధీనం చేసుకుని వసంతకు అప్పగించారు.
తెలంగాణ
రైలులో పోగొట్టుకున్న ఫోన్ బాధితురాలికి అందజేత


