హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళలు స్వశక్తితో ఆర్థిక అభివృద్ధి సాధించాలి'

ADB: మహిళలు స్వశక్తితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని DRDA  APD గోవిందరావు అన్నారు. బుధవారం తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పికోపాల్ తయారీ కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.