హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీపీసీసీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు వెల్లువ

MHBD: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విజయవంతంగా రెండేళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన్ని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించారు.