హైదరాబాద్: 28°C
తెలంగాణ

రఘు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

JGL: తెలంగాణ రక్షణ సేన కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డా. రఘు తల్లి పుష్పలత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మెట్‌పల్లిలోని రఘు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుష్పలత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డా.రఘుతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు.