హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోనెగండ్లలో రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా గోనెగండ్లలో కారు అదుపు తప్పి మరొక వాహనాన్ని ఢీ కొట్టింది. సదరు కారు యజమానిని ఎమ్మిగనూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ రమేశ్ రెడ్డిగా గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో సీఐ మద్యం తాగి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.