హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలికి నివాళి అర్పించిన మాజీ మంత్రి

MHBD: డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన ఇంజం ధర్మరాజు మాతృమూర్తి భద్రమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేడు గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి భద్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.