NTR: తిరువూరులో నందిగామ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది బండి మల్లికార్జునరావుపై నమోదు చేసిన కేసును నిరసిస్తూ తిరువూరు న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. కేసును వెంటనే ఎత్తివేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గోన్నారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాదిపై కేసును నిరసిస్తూ విధుల బహిష్కరణ


