హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి వరద ప్రవాహం

BHPL: మహాదేవపురం మండలంలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహితకు వరద ఉద్ధృతి పెరగడంతో బుధవారం గోదావరి 6.460 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి 1,08,500 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అధికారులు 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.