హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ

RR: షాద్‌నగర్ జానమ్మ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను డీసీపీ శిరీష, మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్ తదితరులు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు, మున్సిపల్ శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయని తెలిపారు. భక్తులు తొందరపడకుండా ఓపికతో, శాంతియుతంగా, క్రమపద్ధతిలో విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసి పోలీసులకు సహకరించాలన్నారు.