హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవయవదానం చేయడం ఆనందంగా ఉంది'

AKP: అఖిలభారత శరీర, అవయవ దాతల సంఘానికి నర్సీపట్నం డిఎస్పి పోతిరెడ్డి శ్రీనివాసరావు తమ అవయవాలను దానం చేస్తూ ఇవాళ అంగీకార పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరణించినప్పటికీ తమ శరీరం ఎంతో మందికి ఉపయోగపడటం ఆనందంగా ఉందన్నారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆర్గాన్ డొనేషన్ సొసైటీ అధ్యక్షురాలు గూడూరు సీతామాలక్ష్మి, బాబ్జి పాల్గొన్నారు.