అన్నమయ్య: చిన్నమండెంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఛైర్మన్ వి. సురేంద్రబాబు మణినాయుడు, ఆలయ అర్చకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాణిపాకం ఆలయంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆహ్వానాన్ని మంత్రి స్వీకరించగా, అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం


